మిష్కిన్‌ దర్శకత్వంలో సమంత | Samantha under the direction of Mysskin | Sakshi
Sakshi News home page

మిష్కిన్‌ దర్శకత్వంలో సమంత

Mar 25 2018 5:34 AM | Updated on Sep 27 2018 8:49 PM

Samantha under the direction of Mysskin - Sakshi

తమిళసినిమా: పెళ్లికి ముందు ఆ తరువాత అన్నట్లుగా సాగుతోంది నటి సమంత సినీ పయనం. అంతకు ముందు గ్లామర్‌ పాత్రలకు ప్రాముఖ్యత నిచ్చిన సమంత ఇప్పుడు బలమైన పాత్రలైతేనే నటించడానికి అంగీకరిస్తున్నారు. అదే విధంగా దర్శకుడు మిష్కిన్‌ చిత్రాల్లో హీరోలకు దీటుగా హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి మిష్కిన్, సమంతల కాంబినేషన్‌లో ఒక చిత్రం వస్తే అది కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. తుప్పరివాలన్‌ చిత్రం తరువాత మిష్కిన్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.

ఇందులో యువ నటుడు శాంతను భాగ్యరాజ్‌ కథానాయకుడిగా నటించనున్నారు. లిడ్రా ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఇందులో నటి సాయిపల్లవి, నిత్యామీనన్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే నటి నిత్యామీనన్‌ ఓకే అయినప్పటికీ, సాయిపల్లవి సెట్‌ కాలేదన్నది తాజా సమాచారం. సాయిపల్లవి కూడా నటించడానికి అంగీకరించినా ఇక్కడ పారితోషికం విషయంలో చెడిందనేది కోలీవుడ్‌ వర్గాల సమాచారం.ఈ అమ్మడు భారీ పారితోషికాన్నే డిమాండ్‌ చేసినట్లు, దీంతో దర్శకుడు మిష్కిన్‌కు చిర్రెత్తుకురాగా అసలు తన చిత్రంలో సాయిపల్లవినే వద్దు అని చెప్పేసినట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

దర్శకుడు మిష్కిన్‌ దృష్టి ఇప్పుడు నటి సమంతపై పడిందట. శాంతను భాగ్యారాజ్‌కు జంటగా ఆమెను నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే  స్టార్స్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమంత యువ నటుడు శాంతను భాగ్యరాజ్‌తో నటించడానికి సమ్మతిస్తారా? అన్నది వేచి చూడాలి. మరో విషయం ఏమిటంటే ఇంతకుముందు సమంత, నిత్యామీనన్‌ మెర్శల్‌ చిత్రంలో విజయ్‌తో నటించారు. ఇప్పుడు మిష్కిన్‌ చిత్రానికి సమంత ఓకే అంటే మరోసారి నిత్యామీనన్‌ కాంబినేషన్‌లో ఈ బ్యూటీని చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement