సియాన్‌తో సమంత | Samantha to romance Vikram | Sakshi
Sakshi News home page

సియాన్‌తో సమంత

Apr 14 2014 1:59 AM | Updated on Sep 2 2017 5:59 AM

సియాన్‌తో సమంత

సియాన్‌తో సమంత

చెన్నై చిన్నది సమంతకు కోలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా పేరు పొందారు.

చెన్నై చిన్నది సమంతకు కోలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా పేరు పొందారు. నిజం చెప్పాలంటే సమంత టాలీవుడ్‌లోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు హిట్ ఖాతాను ప్రారంభించలేదు.  ఈ చెన్నై సుందరి ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సరసన కత్తి , లింగుస్వామి దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న అంజాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు విజయావకాశాలు మెండుగా ఉన్న భారీ చిత్రాలు. సమంతను మరో లక్కీచాన్స్ వరించిందనే తాజా సమాచారం. సియాన్ విక్రమ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నదే ఆ విశేషం. విక్రమ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఐ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది.
 
 ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆడియో త్వరలో జరగనుంది. విక్రమ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్నారు. ఏఆర్ మురుగదాస్ నిర్మించనున్న ఈ చిత్రంలో బబ్లీగర్ల్ పాత్రకు  సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం కొందరు ప్రముఖ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరికి ఈ లక్కీ చాన్స్ సమంతను వరించినట్టు తెలిసింది. సమంత ఇప్పటికే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సరసన నటిస్తున్నందు న ఆమె కు విక్రమ్ కు జంటగా నటించే అవకాశం వరించిందని సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ జూన్ లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement