ఇళయదళపతితో ముచ్చటగా.. | samantha third time with ilayadalapathi vijay | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో ముచ్చటగా..

Dec 25 2016 2:55 AM | Updated on Sep 4 2017 11:31 PM

ఇళయదళపతితో ముచ్చటగా..

ఇళయదళపతితో ముచ్చటగా..

ఇళయదళపతి విజయ్‌ 60వ చిత్రం భైరవా చిత్ర పాటలు ఆయన అభిమానుల్లో యమ జోష్‌ను నింపుతున్నాయి.

ఇళయదళపతి విజయ్‌ 60వ చిత్రం భైరవా చిత్ర పాటలు ఆయన అభిమానుల్లో యమ జోష్‌ను నింపుతున్నాయి. చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విజయ్‌ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న రెండవ చిత్రం ఇది. ఇంతకు ముందు తెరి సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అంతకు ముందు కత్తి చిత్రంలో సమంత విజయ్‌తో జత కట్టారన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎ విఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్‌ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రంలోనూ ఇద్దరు కథానాయికలు ఉంటారట.

అందులో ఒక హీరోయిన్ గా కాజల్‌అగర్వాల్‌ ఇప్పటికే ఎంపికైనట్లు సమాచారం. ఈ అమ్మడికి విజయ్‌తో ఇది మూడో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. తాజా చిత్రంలో కాజల్‌తో పాటు సమంత మరో నాయకిగా నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. సమంత, టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్య ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. ఈ ప్రేమజంట వచ్చే ఏడాది ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోంది. ఈ లోగా సమంత ఓ ఐదు చిత్రాలు చేసేయాలన్న నిర్ణయంతో ఉన్నారట. ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాలు కమిట్‌ అయ్యారు. విజయ్‌ చిత్రం ఓకే అయితే మూడు చిత్రాలు అవుతాయి. ఇక మరో రెండు చిత్రాలు అంగీకరించి ఆ తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement