ఎయిడ్స్ చిన్నారులకు సమంత సాయం | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్ చిన్నారులకు సమంత సాయం

Published Tue, Dec 1 2015 12:05 PM

ఎయిడ్స్ చిన్నారులకు సమంత సాయం

టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తున్న సమంత అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధితో బాదపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మరో నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్న ఎయిడ్స్ చిన్నారులకు ప్రోటీన్ పౌడర్ బాటిల్స్ను అందించింది. ప్రతినెల 1వ తారీఖున వంద మంది చిన్నారులకు ఈ పౌడర్ను అందించనున్నట్టుగా ప్రకటించింది. ఎయిడ్స్ వ్యాధితో బాదపడుతున్న చిన్నారులకు ఆహారలోపం సమస్య కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తన సోషల్ నెట్వర్క్ పేజ్లపై కామెంట్ చేసింది సమంత.

Advertisement
Advertisement