బేబీ ముస్తాబవుతోంది | Samantha next is O Baby Yentha Sakkagunnave | Sakshi
Sakshi News home page

బేబీ ముస్తాబవుతోంది

Dec 27 2018 12:08 AM | Updated on Dec 27 2018 4:25 AM

Samantha next is O Baby Yentha Sakkagunnave - Sakshi

సమంత

పెళ్లయిన హీరోయిన్స్‌కు కెరీర్‌ సాగడం కష్టం అనే అపోహను ఈ ఏడాది నాలుగు సూపర్‌ హిట్స్‌ (రంగస్థలం, మహానటి, యు టర్న్, అభిమన్యుడు)తో బద్దలు కొట్టారు సమంత. అంతే కాదు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో వచ్చే ఏడాదిని ప్లాన్‌ చేసేశారు కూడా. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సమంత. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనున్నారు.

దీని కోసం పూర్తిస్థాయి ప్రోస్థెటిక్‌ మేకప్‌ను ఉపయోగిస్తున్నారట. ఇందులో సమంత తనయుడిగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. విశేషమేంటంటే ‘అత్తారింటికి దారేది, రాజుగారి గది 2’చిత్రాల్లో రావు రమేశ్‌ కూతురిగా సమంత యాక్ట్‌ చేశారు. ఈ సినిమాలో సమంతతో పాటు యంగ్‌ హీరో నాగశౌర్య కనిపిస్తారట. వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి ‘ఓ బేబీ– ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement