పంతులమ్మగా సమంత | Samantha New posters from raju gari gadhi 2 | Sakshi
Sakshi News home page

పంతులమ్మగా మారిన సమంత

Oct 8 2017 12:50 PM | Updated on Jul 15 2019 9:21 PM

Samantha raju Gari Gadhi 2 - Sakshi

కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ రాజు గారి గది 2. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ మెంటలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అక్కినేని వారి కొత్త కోడలు సమంత నటిస్తోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత స్టిల్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

తెల్ల పంచె, లాల్చీలో చేతిలో బెత్తం పట్టుకొని పంతులమ్మలా కనిపిస్తోంది సమంత. గతంలోనూ ఈ లుక్ తో ఉన్న ఫొటోలు బయటకు వచ్చినా అవి రంగస్థలం 1985 సినిమా స్టిల్స్ అయి ఉంటాయని భావించారు. తాజాగా రాజు గారి గది 2 యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో సమంత లుక్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో సమంత దెయ్యంగా కనిపించనుందన్న విషయం ఇప్పటికే తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించినది అయి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement