పిలుపొచ్చింది | "Samantha" is our crazy heroine | Sakshi
Sakshi News home page

పిలుపొచ్చింది

May 5 2014 11:28 PM | Updated on Sep 2 2017 6:58 AM

పిలుపొచ్చింది

పిలుపొచ్చింది

చెన్నై చిన్నది సమంత టైమ్ ఎంత బాగుందంటే ప్రస్తుతం కాల్‌షీట్స్ కూడా అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ

 చెన్నై చిన్నది సమంత టైమ్ ఎంత బాగుందంటే ప్రస్తుతం కాల్‌షీట్స్ కూడా అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్‌గా విరాజిల్లుతున్నారు. విజయ్ సరసన కత్తి, సూర్యకు జంటగా అంజాన్, చిత్రంలో నటిస్తున్న సమంత త్వరలో విక్రమ్‌తో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి గోలిసోడా వంటి చిన్న చిత్రంతో పెద్ద విజయం సాధించిన చాయాగ్రహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ అమ్మడు తాజాగా లింగుసామి దర్శకత్వం వహించనున్న నూతన చిత్రంలో కార్తీతో రొమాన్స్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం.
 
 అంతేకాదు తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమంతకు తాజాగా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. హిందీలో కిల్లాడి ఫేమ్ అక్షయ్ కుమార్ సరసన నటించే లక్కీ చాన్స్‌ను దక్కించుకోవడానికి రెడీ అవుతున్నారట. ఎంతయినా బాలీవుడ్ అవకాశం కదా వదులుకుంటారా? ఏ హీరోయిన్ అయినా అవకాశం వచ్చే వరకు బాలీవుడ్ రంగ ప్రవేశం గురించి ఆలోచన లేదంటారు. అవకాశం వస్తే ఎగిరి గంతేసి మరో ఆలోచన లేకుండా ఓకే అంటారు. నటి సమంత ఇందుకు అతీతం అని ఎలా అనుకుంటాం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement