రాంచరణ్ కు జోడీగా సమంత? | Samantha in Ram Charan's next? | Sakshi
Sakshi News home page

రాంచరణ్ కు జోడీగా సమంత?

Jan 1 2015 12:34 PM | Updated on Sep 2 2017 7:04 PM

రాంచరణ్ కు జోడీగా సమంత?

రాంచరణ్ కు జోడీగా సమంత?

హీరో రాంచరణ్ తదుపరి మూవీలో సమంతను హీరోయిన్ ఎంపికచేసినట్లు తెలుస్తోంది.

చెన్నై: హీరో రాంచరణ్ తదుపరి మూవీలో సమంతను హీరోయిన్ గా ఎంపికచేసినట్లు తెలుస్తోంది.  రాంచరణ్ గోవిందుడు అందరివాడేలా చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్నఈ చిత్రానికి సంబంధించి పేపర్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలోనే నటీ నటుల కాస్టింగ్ జరుగుతోంది.  ఇందులో భాగంగా రాంచరణ్ కు జోడీగా సమంతను పెడితే ఎలా ఉంటుందనేది చర్చకు వచ్చింది.  నటి సమంత పేరును దాదాపు ఖరారు చేసినా.. అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

 

రాంచరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నతొలి  చిత్రంలో రెండో హీరోయిన్ కోసం కూడా ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాంచరణ్ ప్రక్కన సమంత జోడీ కడితే మాత్రం.. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే తొలి మూవీ కూడా ఇదే అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement