మామగారి సినిమాలో సమంత | Samantha in nagarjuna Raju gari Gadhi 2 | Sakshi
Sakshi News home page

మామగారి సినిమాలో సమంత

Jan 7 2017 1:10 PM | Updated on Jul 15 2019 9:21 PM

మామగారి సినిమాలో సమంత - Sakshi

మామగారి సినిమాలో సమంత

ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. టీవీ యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత డైరెక్టర్గా

ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. టీవీ యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత డైరెక్టర్గా సక్సెస్ సాధించిన ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలోనే తెరకెక్కిన రాజుగారి గది సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement