‘చై విత్‌ సామ్‌.. వర్సెస్‌ కాదు’

Samantha Comment On Chay Vs Sam - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సమంత, నాగచైతన్యలు త్వరలో వెండితెర మీద తలపడనున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యు టర్న్‌, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు ఒకే రోజు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ రెండు సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ ఆసక్తికరమైన పోటిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సమంత, చైతూల పెళ్లి సమయంలో చైసామ్‌ అనే హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్‌లో సందడి చేసింది. ఇప్పుడు అదే తరహాలో చై వర్సెస్‌ సామ్‌ (#chayVsSam) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌ అవుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన సమంత, చై వర్సెస్‌ సామ్‌ కాదు చై విత్‌ సామ్‌(#ChayWithSam) అంటూ కామెంట్ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top