పెళ్లి తరువాత బాలీవుడ్ ఎంట్రీ | Samantha bollywood entry confirmed | Sakshi
Sakshi News home page

పెళ్లి తరువాత బాలీవుడ్ ఎంట్రీ

Oct 3 2017 4:33 PM | Updated on Oct 3 2017 6:53 PM

Samantha bollywood entry confirmed

సినీ రంగంలో పెళ్లి తరువాత హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టే అని భావిస్తున్నారు. కానీ అందరి విషయంలో అలా జరగదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి తారలు పెళ్లి తరువాత కూడా గ్లామర్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు. అయితే సౌత్ లో అలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ. దక్షిణాదిలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సమంత మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది.

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు ఇప్పటి వరకు దక్షిణాది ప్రేక్షకులను మాత్రమే అలరించిన ఈ బ్యూటీ, పెళ్లి తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమాతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటోంది సామ్.

ప్రస్తుతం రాజుగారి గది 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ నెల 6న నాగచైతన్యను పెళ్లాడనున్న ఈ భామ, తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి షూటింగ్ లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement