గ్లామర్‌ ప్రపంచమని తెలిసే వచ్చా..! | samantha acted with vijay sethupathi in tamil movie | Sakshi
Sakshi News home page

గ్లామర్‌ ప్రపంచమని తెలిసే వచ్చా..!

Feb 10 2018 6:15 PM | Updated on Feb 10 2018 6:56 PM

samantha acted with vijay sethupathi in tamil movie - Sakshi

సాక్షి, చెన్నై: సినిమా గ్లామర్‌ ప్రపంచం అని తెలిసే ఈ రంగంలోకి వచ్చానని హీరోయిన్‌ సమంత అన్నారు. టాలీవుడ్‌లో తొలిచిత్రంతోనే ప్రక్షకులను ఏంమాయచేశారోగానీ ఫిదా అయ్యారు. అంతే ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌ అయిపోయారు. చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కెరీర్‌ ముగిసిపోతుందని భయపడతారు. అయితే ఈ విషయంలో నటి సమంత మాత్రం అలాంటి వాటికి భయపడలేదు. 

తన సినీజీవితం, సంసార జీవితం గురించి ఇటీవల ఇచ్చిన భేటీలో సమంత కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం. ‘గ్లామర్‌ ప్రపంచం అని తెలిసే నేను ఈ రంగంలోకి ప్రవేశించాను. కథకు గ్లామర్‌ అవసరం అయితే అలా నటించడం తప్పుకాదు. అయితే అనవసరంగా గ్లామర్‌ గుప్పించడం నాకిష్టం ఉండదు. సంసార జీవితం ఎలా సాగుతోంది అని చాలా మంది అడుగుతున్నారు. భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవిస్తే వృత్తిలోనూ కొనసాగడం కష్టం కాదు. వివాహానంతరం నా భర్త నాగచైతన్య కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ నన్ను నటించవద్దని చెప్పలేదు. హీరోయిన్‌గా కొనసాగడం నాకు నచ్చింద’ని ఆమె తెలిపారు.

‘నాగచైతన్యకు మీకూ మధ్య గొడవలు వస్తుంటాయా అని అడుగుతుంటారు. మా మధ్య గొడవలు వస్తుంటాయి. గొడవ తర్వాత చైతూ దిగిరారు. నేనే మాట్లాడుతాను. నిజం చెప్పాలంటే చైతూ గొడవ పడరు. నేనే గొడవ చేస్తా. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. విజయ్‌సేతుపతితో సూపర్‌ డీలక్స్‌ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అదే తెలుగులో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటితో పాటు సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాని’ హీరోయిన్‌ సమంత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement