కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా | Samantha, Aadhi Pinisetty and Rahul Ravindran's 'U Turn' traler release | Sakshi
Sakshi News home page

కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా

Aug 18 2018 12:32 AM | Updated on Jul 14 2019 1:28 PM

Samantha, Aadhi Pinisetty and Rahul Ravindran's 'U Turn' traler release - Sakshi

ఆది, సమంత, రాహుల్‌ రవీంద్రన్, పవన్‌కుమార్, శ్రీనివాస చిట్టూరి

‘‘యు టర్న్‌’ టీమ్‌ అంతా ఫ్రెండ్సే. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి ఈ సినిమా చేశాం. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ‘లూసియా’ సినిమాతో దర్శకుడు పవన్‌కుమార్‌కి పెద్ద ఫ్యాన్‌ అయ్యాను’’ అని సమంత అన్నారు. ఆమె లీడ్‌ రోల్‌లో, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్‌’. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ – ‘‘అందరం సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం ‘యు టర్న్‌’. నిర్మాతలు కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా.

కానీ, వాళ్లు చక్కగా డీల్‌ చేశారు. మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్‌ చేస్తారని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సమంత మంచి నటే కాదు.. మంచి మనిషి కూడా. నా చిత్రాల్లో మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిన చిత్రమిది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఒకప్పుడు సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా కనపడుతోంది. నటిగా ఇంకా ఎదిగింది’’ అన్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ‘‘ఇంత మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చాలా విషయాలను నేర్పింది. సమంతగారు మంచి నటి. ఆవిడతో పనిచేయడం హ్యాపీ’’ అన్నారు పవన్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement