ఈ మోడల్‌తో సల్మాన్ పెళ్ళి లేనట్లే! | salmankhan about his marriage | Sakshi
Sakshi News home page

ఈ మోడల్‌తో సల్మాన్ పెళ్ళి లేనట్లే!

Nov 10 2016 10:52 PM | Updated on Sep 4 2017 7:44 PM

ఈ మోడల్‌తో సల్మాన్ పెళ్ళి లేనట్లే!

ఈ మోడల్‌తో సల్మాన్ పెళ్ళి లేనట్లే!

‘నవంబర్ 18న పెళ్లి చేసుకుంటా’ అంటూ ఓ సందర్భంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరపడిపోయారు.

‘నవంబర్ 18న పెళ్లి చేసుకుంటా’ అంటూ ఓ సందర్భంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరపడిపోయారు. రుమేనియాకు చెందిన మోడల్ లూలియా వంటుర్‌తో సల్మాన్ ప్రేమలో ఉండటం, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం కూడా అయిందనే వార్తలు రావడంతో ఈ ఏడాదే వారు పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్నారంతా. నవంబర్ రానే వచ్చింది. 18వ తారీఖు కూడా దగ్గర పడుతోంది.

అయితే సల్లూ అభిమానులకు మళ్లీ నిరాశ, ఎదురు చూపులు తప్పేలా లేవు. సల్మాన్, లూలియా విడిపోయారన్నది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. లూలియాకు ఆల్రెడీ పెళ్లి అయిందంటూ ఆమె భర్తతో కలిసి దిగిన ఫొటోలు కొద్దిరోజులు హల్‌చల్ చేశాయి. ఆ తర్వాత కూడా సల్లూ, ఈ అమ్మడు కలిసి దర్శనమివడంతో కలిసే ఉన్నారనుకున్నారంతా. కానీ, ఏం జరిగిందో ఏమో ప్రేమకు బ్రేకప్ చెప్పేశారనీ, దాంతో లూలియాముంబై వదిలి తన సొంత దేశం రుమేనియాకు వెళ్లిపోయారని సమాచారం. మొత్తానికి లూలియాతో, సల్మాన్ పెళ్ళి లేనట్లే.

Advertisement
 
Advertisement
Advertisement