ఫోర్‌.. సిక్స్‌! | Salman Khan's Bharat teaser to be out on Republic Day | Sakshi
Sakshi News home page

ఫోర్‌.. సిక్స్‌!

Jan 18 2019 2:10 AM | Updated on Jan 18 2019 2:10 AM

Salman Khan's Bharat teaser to be out on Republic Day - Sakshi

సల్మాన్‌ఖాన్‌

ఆఫ్‌ సైడ్, ఆన్‌ సైడ్‌ అన్న తేడా లేకుండా ఫీల్డర్స్‌ను పరిగెత్తించారు సల్మాన్‌ఖాన్‌. అవును.. సల్మాన్‌ క్రికెట్‌ ఆడారు. కానీ స్టేడియంలో కాదు. ‘భారత్‌’ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ ప్లేస్‌లో. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘భారత్‌’. ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ అనే కొరియన్‌ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. ఇందులో కత్రినా కైఫ్‌ కథానాయిక.

దిశాపాట్నీ, టబు, జాకీ ష్రాఫ్, సునీల్‌ గ్రోవర్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అయ్యింది. షూట్‌ కంప్లీట్‌ అయిన తర్వాత సల్మాన్‌ అండ్‌ టీమ్‌ సరదాగా క్రికెట్‌ ఆడారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ‘భారత్‌’ విషయానికొస్తే.. ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ ఏడాది రంజాన్‌కు ‘భారత్‌’ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement