‘సల్మాన్‌ చాన్స్‌ ఇస్తా అన్నాడు’ | Salman Khan Promises To Help Saroj Khan | Sakshi
Sakshi News home page

‘సల్మాన్‌ చాన్స్‌ ఇస్తా అన్నాడు’

Mar 31 2019 12:22 PM | Updated on Mar 31 2019 3:56 PM

Salman Khan Promises To Help Saroj Khan - Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఎక్కువగా వివాదాలతో ఎలా వార్తల్లో నిలుస్తుంటారో, అదే స్థాయిలో తన మంచి మనసును కూడా చాటుకుంటుంటాడు సల్లూభాయ్‌. గతంలో చాల మంది నటులకు సాయం చేసిన సల్మాన్‌ తాజాగా లెజెండరీ కొరియోగ్రాఫర్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 2015లో రిలీజ్‌ అయిన తనూ వెడ్స్‌ మను తరువాత చాలా కాలం సినిమాలకు దూరమైన సరోజ్‌ ఖాన్‌ ఇటీవల మణికర్ణిక, కలంక్‌ సినిమాకు పని చేశారు.

ప్రస్తుతం ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్‌ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల సల్మాన్‌ ను కలిసి సరోజ్‌ ఖాన్ ఇదే విషయాన్ని సల్మాన్‌తో ప్రస్థావించటంతో త్వరలో మనం కలిసి పని చేద్దాం అంటూ మాట ఇచ్చారట. ఈ విషయాన్ని సరోజ్‌ ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘చాలా కాలం తరువాత సల్మాన్‌ను కలవటం ఆనందంగా ఉంది. నీకు ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉంటాయి’ అంటూ కామెంట్ చేశారు సరోజ్‌ ఖాన్‌.

Advertisement
 
Advertisement
Advertisement