రుమేనియా బ్యూటితో సల్మాన్ పెళ్లి | Salman Khan hints at marriage this year to Romanian beauty Iulia Vantur | Sakshi
Sakshi News home page

రుమేనియా బ్యూటితో సల్మాన్ పెళ్లి

Mar 10 2014 2:34 AM | Updated on Sep 2 2017 4:31 AM

రుమేనియా బ్యూటితో సల్మాన్ పెళ్లి

రుమేనియా బ్యూటితో సల్మాన్ పెళ్లి

బాచిలర్ లైఫ్ తో విసిగెత్తిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు.

బ్యాచిలర్  లైఫ్ తో విసిగెత్తిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సల్మాన్.. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న  రుమేనియా బ్యూటి లులియా వాంటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. గత కొద్దికాలంగా పెళ్లిపై దృష్టి మరలిందన్నాడు. కొద్ది రోజులుగా నిట్టూర్పులతో జీవితం గడుస్తోందని.. ఇక నిట్టూర్పులకు ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు సల్మాన్ వెల్లడించారు.
 
మానవత్వం అంటే ఇష్టమని.. ఇస్లాం, క్రైస్తవ మతాలను నమ్ముతాను.. నా తండ్రి ముస్లిం.. తల్లి హిందువు.. రెండవ తల్లి కాథలిక్.. బావ పంజాబీ.. అయితే ఈసారి మా ఇంట్లోకి బయట నుంచి కోడల్ని తీసుకురావాలనుకుంటున్నానని సల్మాన్ చమత్కరించారు. ఎంతోమంది హీరోయిన్లతో సల్మాన్ కు  అఫైర్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను లవర్ కంటే మంచి ఫ్రెండ్ గా సరిపోతానని సల్మాన్ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement