ధూమ్ 4లో సల్మాన్, రణవీర్..? | Salman Khan and Ranveer Singh in Dhoom 4 | Sakshi
Sakshi News home page

ధూమ్ 4లో సల్మాన్, రణవీర్..?

May 10 2016 5:19 PM | Updated on Sep 3 2017 11:48 PM

ధూమ్ 4లో సల్మాన్, రణవీర్..?

ధూమ్ 4లో సల్మాన్, రణవీర్..?

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమా సీరీస్ ధూమ్. ఇప్పటికే మూడు భాగాలుగా సూపర్ హిట్ అయిన ఈ సీరీస్లో నాలుగో భాగంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమా సీరీస్ ధూమ్. ఇప్పటికే మూడు భాగాలుగా సూపర్ హిట్ అయిన ఈ సీరీస్లో నాలుగో భాగంపై చాలారోజులుగా చర్చ జరుగుతోంది. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహం లాంటి టాప్ స్టార్స్ నటించిన పాత్ర కోసం మరో సూపర్ స్టార్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు ధూమ్ యూనిట్.

ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ స్టార్గా వెలుగొందుతున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ను ధూమ్లో నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ కూడా ఓ ఇంటర్వ్యూలో నెగెటివ్ రోల్ చేయాలని ఉందని కామెంట్ చేయటంతో నెక్ట్స్ సినిమాలో ధూమ్ దొంగ సల్మానే అన్న టాక్ వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్తో సల్మాన్ ఖాన్కు ఉన్న అనుబంధం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

అయితే ఈ సినిమాను యూత్ ఆడియన్స్కు మరింత చేరువ చేయాలన్న ఆలోచన ఉన్న చిత్రయూనిట్, మరో కీలక పాత్రలో యువ నటుడు రణవీర్ సింగ్ను తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, ధూమ్ సీరీస్లో మరో భాగం త్వరలోనే పట్టాలెక్కనుందన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement