రీసౌండ్‌ | sairam shankar resound movie launch | Sakshi
Sakshi News home page

రీసౌండ్‌

Dec 2 2019 6:38 AM | Updated on Dec 2 2019 6:38 AM

sairam shankar resound movie launch - Sakshi

రాశీసింగ్‌, సాయిరామ్‌ శంకర్‌

సాయిరామ్‌ శంకర్‌ రీసౌండ్‌ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రీ సౌండ్‌’ కి కొబ్బరికాయ కొట్టారు. ఎస్‌ఎస్‌ మురళీకృష్ణ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీసింగ్‌ కథానాయికగా నటించనున్నారు. జె. సురేష్‌ రెడ్డి, రాజు, ఎన్‌వీఎన్‌ రాజా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి కెమెరా సిచ్చాన్‌ చేయగా, మరో దర్శకుడు సుకుమార్‌ క్లాస్‌ ఇచ్చారు.

నటుడు పోసాని కృష్ణమురళి గౌరవ దర్శకత్వం వహించారు. సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘నేటి నుంచి మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం అవుతుంది. హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరించనున్నాం’’ అన్నారు . ‘‘అందరికీ నచ్చే మంచి వాణిజ్య అంశాలున్న  సినిమా ఇది’’ అన్నారు మురళీ  కృష్ణ. సాయిరామ్‌శంకర్‌ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు నిర్మాత రాజారెడ్డి. నటుడు ఆకాష్‌ పూరి పాల్గొన్నారు. ఈ మూవీకి సంగీతం: స్వీకర్‌ అగస్తి.

Advertisement
 
Advertisement
Advertisement