కామెడీ అండ్‌ ఫాంటసీ | Sai Sushanth Chandini Simran new Movie Opening | Sakshi
Sakshi News home page

కామెడీ అండ్‌ ఫాంటసీ

Apr 21 2019 12:17 AM | Updated on Apr 21 2019 12:17 AM

Sai Sushanth Chandini Simran  new Movie Opening - Sakshi

సిమ్రాన్, సుశాంత్, చాందినీ చౌదరి

‘ఈ నగరానికి ఏమైంది?’ ఫేమ్‌ సాయి సుశాంత్, సిమ్రాన్‌ చౌదరి, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రాఘవేంద్ర వర్మ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు బీఏ సమర్పణలో సుచేత డ్రీమ్‌ వర్క్స్‌ పతాకంపై విశ్వాస్‌ హన్నుర్కర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ–ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సాయి, సిమ్రాన్, చాందిని.. ఇలా ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు కుదిరారు. మంచి సాంకేతిక నిపుణులతో తెరెక్కిస్తున్నాం’’ అన్నారు విశ్వాస్‌. తనికెళ్ల భరణి, ప్రియదర్శి, మకరంద్‌ దేశ్‌ పాండే, శిశిర్‌ వర్మ, ఝాన్సీ, వినీత్‌ కుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు బి. జోష్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement