ఫిదా లిరిక్స్తో సాయి పల్లవి..! | Sai Pallavi, Dulquer Salmaan In Hey Pillagada | Sakshi
Sakshi News home page

ఫిదా లిరిక్స్తో సాయి పల్లవి..!

Aug 19 2017 3:22 PM | Updated on Sep 17 2017 5:42 PM

ఫిదా లిరిక్స్తో సాయి పల్లవి..!

ఫిదా లిరిక్స్తో సాయి పల్లవి..!

ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.

ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ మల్లార్ బ్యూటీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు. అందుకే సాయి పల్లవి లీడ్ రోల్ లో గతంలో రిలీజ్ అయిన మలయాళ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన మలయాళ సినిమాను తెలుగు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు టైటిల్ లో కూడా ఫిదా ఫ్లేవర్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆసినిమాలో సూపర్ హిట్ పాటలోని 'హేయ్ పిల్లగాడ' అనే లిరిక్స్ ను ఈ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివి కృష్ణస్వామి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో పాపులర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement