కన్నడ కార్తికేయలో ఆది? | Sai Kumar Plans karthikeya kannada remake with Aadi | Sakshi
Sakshi News home page

కన్నడ కార్తికేయలో ఆది?

Jul 8 2016 8:48 AM | Updated on Sep 4 2017 4:25 AM

కన్నడ కార్తికేయలో ఆది?

కన్నడ కార్తికేయలో ఆది?

డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా టాలీవుడ్కు పరిచయం అయిన యంగ్ హీరో ఆది. తొలి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆది.. తరువాత మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి...

డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా టాలీవుడ్కు పరిచయం అయిన యంగ్ హీరో ఆది. తొలి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆది.. తరువాత మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి పెట్టి ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం వీరభద్రం దర్శకత్వంలో చుట్టాలబ్బాయి సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆది.

అదే సమయంలో కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాయికుమార్కు టాలీవుడ్తో పాటు శాండల్వుడ్లో కూడా స్టార్ ఇమేజ్ ఉంది. సాయికుమార్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రాలు మంచి సక్సెస్లు సాధించాయి. దీంతో ఆదిని కూడా కన్నడలో హీరోగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు సాయికుమార్.

నిఖిల్ హీరోగా టాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించిన కార్తీకేయ సినిమాను ఆది హీరోగా కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తెలుగులో చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ హీరోగా.. నిఖిల్కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆది విషయంలో కూడా అదే వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు డైలాగ్ కింగ్. మరి తెలుగు నాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న, ఆది శాండల్వుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement