
ఆది సాయికుమార్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించి, శనివారం రిలీజ్ డేట్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘‘పాన్–ఇండియా స్థాయి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రస్తుతంపోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌లా కనిపిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ప్రవీణ్ కె. బంగారి.