సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా! | sai dharam tej started new movie | Sakshi
Sakshi News home page

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా!

Jul 24 2015 11:34 PM | Updated on Sep 3 2017 6:06 AM

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా!

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా!

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో సెప్టెంబర్‌లో సందడి చేయనున్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో సెప్టెంబర్‌లో సందడి చేయనున్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా  ‘ఓం’ అనే త్రీడీ చిత్రాన్ని తెరకెక్కించిన సునీల్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
 
 శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి. రోహిణ్‌రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రారంభ వేడుక జరుపుకోనుంది. ఇందులో సాయిధరమ్‌తేజ్ సరసన ఓ క్రేజీ కథానాయిక నటించనున్నారు. మరో నలుగురు అమ్మాయిలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. రాజేంద్రప్రసాద్ ముఖ్య భూమిక పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహ నిర్మాత: కిరణ్‌రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement