బిగ్‌బాస్‌లో బర్త్‌డే చేసుకోవడం బాధాకరం: టీవీ నటి

Sad about celebrating my birthday in the Bigg Boss

ఎవరైనా బంధుమిత్రుల నడుమ ఆనందంగా పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటారు. ఆత్మీయులు, సన్నిహితుల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటే.. ఆ సంతృప్తే వేరు. ఆ సంతోషం తనకు లేకుండా పోయిందని ప్రముఖ టీవీనటి హినా ఖాన్‌ వాపోతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో పరిచయం లేనివారి నడుమ బర్త్‌ డే జరుపుకోవాలంటే బాధగా ఉందని ఆమె పేర్కొంది. 'యే రిష్తా క్యా కెహ్‌లాతా హై' సీరియల్ ద్వారా పాపులర్‌ అయిన హినా ఖాన్‌.. తాజాగా హిందీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-11లో పాల్గొంటున్నది. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంటరైన హినా ఖాన్‌ పుట్టినరోజు నేడు (సోమవారం).

బిగ్‌బాస్‌ హౌజ్‌లో పరిచయం లేని అగంతకుల నడుమ తన పుట్టినరోజు జరుపుకోవాల్సి రావడం బాధాకరమని ఈ షోలో పాల్గొనేముందు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హినా ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. 'అగంతకులతో కలిసి బర్త్‌డే జరుపుకోవాల్సి రావడం నిజంగా బాధ కలిగిస్తోంది. హౌజ్‌లో ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు. కానీ, బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ మిస్‌ అయినా.. నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఆశీస్సులు, ప్రేమ నాపై ఉంటాయి. ఈ సంవత్సరం వారి ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం' అని హినా ఖాన్‌ పేర్కొంది. తాజాగా ఖత్రోంకి కిలాడీ రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిన హినా.. బిగ్‌బాస్‌లోనూ రాణిస్తానని ఆశాభావంతో ఉంది.

❤️

A post shared by Hina Khan (@realhinakhan) on

#kKK

A post shared by Hina Khan (@realhinakhan) on

Back to Top