సచిన్‌ కోసం ప్రత్యేకంగా... | Sachin Tendulkar Meets Shahrukh Khan See The Adorable Comment | Sakshi
Sakshi News home page

సచిన్‌ కోసం ప్రత్యేకంగా...

Jul 3 2018 7:21 PM | Updated on Jul 3 2018 7:39 PM

Sachin Tendulkar Meets Shahrukh Khan See The Adorable Comment - Sakshi

షారుఖ్‌ ఖాన్‌- సచిన్ టెండుల్కర్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో సచిన్‌ అభిమానులతో పాటు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ అభిమానుల మనసు కూడా దోచుకుంటోంది. మహారాష్ట్రలో ఓ వివాహ వేడుకకు హాజరైన సచిన్‌, షారుఖ్‌తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేశారు. ‘జబ్‌ ఎస్‌ఆర్‌కే(షారుఖ్‌ ఖాన్‌) మెట్‌ ఎస్‌ఆర్‌టీ(సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌) ??’  అంటూ క్యాప్షన్‌ కూడా జత చేశారు.

సచిన్‌ ట్వీట్‌కు స్పందించిన షారుఖ్‌... ‘ఫొటోలను ఆల్బమ్‌లో పదిలపరచుకునే అలవాటు లేదు. కానీ ఇటువంటి గొప్ప వ్యక్తితో దిగిన ఫొటోను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలి అనుకుంటున్నా గనుక ఆయన కోసం  ప్రత్యేకంగా ఓ ఆల్బమ్‌ను తయారు చేసుకుంటా’  అంటూ సచిన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. టోపీ(వివాహ వేడుకలో ధరించే సంప్రదాయ టోపీ) పెట్టుకున్న మీ ఇద్దరు ఈ సెల్ఫీలో ఎంతో చక్కగా ఉన్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement