కన్ఫామ్‌ చేసిన ‘సాక్ష్యం’ టీం

Saakshyam Worldwide Grand Release on 27th July - Sakshi

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. గతం కొద్ది రోజులుగా సాక్ష్యం సినిమా రిలీజ్‌ వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో జంతువులు, పక్షులను వినియోగించినందున సెన్సార్ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా వార్తలు వినిపించాయి.

ఈ వార్తలకు చెక్‌ పెడుతూ సాక్ష్యం టీం సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న  ఈ సినిమా  శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top