అత్యాశకు పోతే... | Runam Movie Press Meet | Sakshi
Sakshi News home page

అత్యాశకు పోతే...

Oct 21 2017 12:08 AM | Updated on Oct 21 2017 12:08 AM

Runam Movie Press Meet

‘‘ప్రతి మనిషి జీవితంలో ఎవరికో ఒకరికి ఋణపడుతుంటాడు. ఆ ఋణం తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ అనేది మనిషి జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథః పాతాళానికి తొక్కుతుంది. అత్యాశ వల్ల కలిగే అనర్థాలను ‘రుణం’ చిత్రంలో వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం’’ అన్నారు దర్శకుడు ఎస్‌. గుండ్రెడ్డి.

గోపీకృష్ణ, మహేంద్ర, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో భీమినేని సురేశ్, జి. రామకృష్ణారావు నిర్మిస్తున్న సినిమా ‘రుణం’. పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అన్నారు. చిత్ర సమర్పకులు గాలిరెడ్డి, గోపీకృష్ణ, మహేంద్ర, ప్రియాంక, విలన్‌ పాత్రధారి ప్రదీప్‌ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్‌.వి. మల్లిక్‌ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్‌. 

Advertisement
 
Advertisement
Advertisement