ఒక్క పాటకు రూ. 3.5 కోట్లా..! | rs 3.5 crore song for mahesh srikanth addala bramhotsvam | Sakshi
Sakshi News home page

ఒక్క పాటకు రూ. 3.5 కోట్లా..!

Oct 2 2015 12:53 PM | Updated on Sep 3 2017 10:21 AM

ఒక్క పాటకు రూ. 3.5 కోట్లా..!

ఒక్క పాటకు రూ. 3.5 కోట్లా..!

శ్రీమంతుడు సినిమాతో రికార్డ్ సృష్టించిన మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమా విషయంలోనూ అదే హవా కొనసాగిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో తన మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరగటంతో మహేష్ సినిమాకు...

శ్రీమంతుడు సినిమాతో రికార్డు సృష్టించిన మహేష్ బాబు తన తర్వాతి సినిమా విషయంలోనూ అదే హవా కొనసాగిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో తన మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరగటంతో మహేష్ సినిమాకు ఎంత ఖర్చయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. దీంతో బ్రహ్మోత్సం సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలింసిటిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రూ. 3.5 కోట్లతో ఒక పాటను తెరకెక్కిస్తున్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ పెళ్లి పాటలో సినిమాలోని అందరు నటీనటులతో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్ట్లు కూడా పాల్గొంటున్నారు.

పివిపి బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు  హీరోయిన్లుగా నటిస్తుండగా షార్ట్ ఫిలిం స్టార్ చాందిని చౌదరి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement