breaking news
bramhotsvam
-
పవన్ vs మహేష్
టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్‌కి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ వేసవిలో తమ సినిమాలతో రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉన్నా, రికార్డ్ల విషయంలో మాత్రం భారీగా పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో రిలీజ్ కాగా, ఏప్రిల్ 8న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయాడానికి రెడీ అవుతున్నారు. ఇక మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసి మే లో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పక్కాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారిన్ మార్కెట్లో గట్టి పట్టున్న మహేష్, ఓవర్సిస్ రైట్స్ విషయంలో పై చేయి సాధించాడు. బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, సర్థార్ గబ్బర్‌సింగ్ 11.5 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం పవన్ ముందున్నాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, బ్రహ్మోత్సవం రైట్స్ 11.5 కోట్లతో సరిపెట్టుకుంది. బిజినెస్‌లోనే ఇంతగా పోటి పడుతున్న ఈ ఇద్దరు స్టార్స్, రిలీజ్ తరువాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డ్స్ నమోదు చూస్తారో చూడాలి. -
ఒక్క పాటకు రూ. 3.5 కోట్లా..!
శ్రీమంతుడు సినిమాతో రికార్డు సృష్టించిన మహేష్ బాబు తన తర్వాతి సినిమా విషయంలోనూ అదే హవా కొనసాగిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో తన మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరగటంతో మహేష్ సినిమాకు ఎంత ఖర్చయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. దీంతో బ్రహ్మోత్సం సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలింసిటిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రూ. 3.5 కోట్లతో ఒక పాటను తెరకెక్కిస్తున్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ పెళ్లి పాటలో సినిమాలోని అందరు నటీనటులతో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా పాల్గొంటున్నారు. పివిపి బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తుండగా షార్ట్ ఫిలిం స్టార్ చాందిని చౌదరి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.