‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర దర్శకుడు ఎవరు?

RRR Movie: Two Directors Name Show In Google Search - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో తీస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి నిత్యం ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో ఏదో ఒకటి వైరల్‌ అవుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర దర్శకుడు ఎవరు? అని అడిగితే సినిమాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నవారెవరైనా రాజమౌళి పేరు టక్కున చెబుతారు. కానీ గూగుల్‌ మాత్రం తడబడుతోంది. 

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర దర్శకుడి గురించి సెర్చ్‌ చేస్తే రాజమౌళితో పాటు సంజయ్‌ పాటిల్‌ పేరును చూపిస్తోంది. మరి ఈ సంజయ్‌ పాటిల్‌ ఎవరా అని వెతికితే అతడి గురించి ఎలాంటి సమాచారం చూపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇద్దరు దర్శకుల పేర్లు చూపించడంపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీంగా కనిపంచనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. 

చదవండి:
యంగ్‌ టైగర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌!
ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జక్కన్న మరో మల్టీస్టారర్‌..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top