ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జక్కన్న మరో మల్టీస్టారర్‌..!

SS Rajamouli Multistarrer With Mahesh And Prabhas Rumors Viral On Social Media - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలు. ఈ సినిమాలో హిందీ నటుడు అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో  కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే తాజాగా ఓ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం చుట్టారట. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారని టాక్‌.

దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న‘ఆర్‌ఆర్‌ఆర్‌’  చిత్రం జనవరి 8, 2021 విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top