రాణిగారికీ రూల్స్‌ ఉన్నాయి! | Royal Rules Meghan Markle Has to Follow Now That She is a Duchess | Sakshi
Sakshi News home page

రాణిగారికీ రూల్స్‌ ఉన్నాయి!

May 24 2018 12:26 AM | Updated on May 24 2018 12:26 AM

Royal Rules Meghan Markle Has to Follow Now That She is a Duchess - Sakshi

మేఘన్‌ మార్కెల్‌

బ్రిటన్‌ యువరాజు హ్యారీని హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ ఇటీవల వివాహమాడిన విషయం తెలిసిందే. యువరాజుని పెళ్లాడటంతో యువరాణి అయిపోయారు మేఘన్‌. సకల సౌకర్యాలు లభిస్తాయి అనుకోవడంలో ఎటువంటి సందేహాలు లేవు. వాటితో పాటుగా రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయట ఈ యువరాణిగారికి. రాజకుటుంబంలో సభ్యురాలు అయ్యారు కాబట్టి మేఘన్‌ మార్కెల్‌ ఇక మీదట ఇంతకుముందులా మామూలు సిటిజన్‌ కాదు. రాజకుటుంబీకుల లైఫ్‌ స్టైల్‌కు, వాళ్ల పద్ధతులకు అలవాటు పడాలి. అందులో కొన్ని రూల్స్‌ ఈ విధంగా ఉంటాయని సమాచారం.

సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేయకూడదు. సోషల్‌ మీడియాలో అకౌంట్‌లు ఉండకూడదు. డ్రెస్సింగ్‌ విషయానికి వస్తే మినీ–స్కర్ట్స్‌కు దూరంగా ఉండాలి. షెల్‌ ఫిష్‌ తినకూడదు. డిన్నర్‌ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. ఏదైనా ఫంక్షన్‌ ఉన్నప్పుడు హస్బెండ్‌ హ్యారీ పక్కనే కూర్చోవాలి. కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోకూడదు. కావాలంటే ఒకవైపు వాలుగా కాళ్లు పెట్టుకోవచ్చు. తన కంటే పై స్థాయిలోని వాళ్లు రూమ్‌లోకి రాగానే మర్యాదపూర్వకంగా గౌరవించాలి. ఇలాంటి కొన్ని నియమాలను రాజకుటుంబంలోకి వెళ్తున్నందుకు మార్కెల్‌ పాటించాలట. సో.. మార్కెల్‌ ఇక మీదట పాత మార్కెల్‌లా ఉండబోరన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement