రోగ్ ఆడియో రిలీజ్కు టాప్ స్టార్స్ | Rogue audio event Plans | Sakshi
Sakshi News home page

రోగ్ ఆడియో రిలీజ్కు టాప్ స్టార్స్

Mar 7 2017 4:49 PM | Updated on Sep 5 2017 5:27 AM

రోగ్ ఆడియో రిలీజ్కు టాప్ స్టార్స్

రోగ్ ఆడియో రిలీజ్కు టాప్ స్టార్స్

వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ రోగ్. ఈ సారి ఎలాగైన హిట్

వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ రోగ్. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాను తెరకెక్కించాడు పూరి. తన కెరీర్ను మలుపు తిప్పిన ఇడియట్ లాంటి హిట్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమాకు మరో చండిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ను జోడించాడు. తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇటీవల రిలీజ్ అయిన టైలర్కు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు ఆడియో రిలీజ్ను మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇషాన్ ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు కావటంతో లాంచింగ్ భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆడియో వేడుకకు పలువురు టాప్ స్టార్స్ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కన్నడ టాప్ హీరోలు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, సుదీప్లు ఈ ఆడియో ఈవెంట్కు హాజరయ్యేందుకు అంగీకరించారు. వీరితో పాటు  టాలీవుడ్ హీరోలను కూడా ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇషాన్ సరసన మన్నార చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. విన్నర్, సింగం 3 సినిమాల్లో విలన్గా నటించిన థాకూర్ అనూప్ సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, హీరోయిన్లు మార్పు తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. భారీ గా ప్లాన్ చేసిన ఈ ఆడియో ఈవెంట్ ఈ నెల 9న బెంగళూరు ప్యాలెస్లో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement