వర్మ వీక్‌ పాయింట్‌పై కొట్టేశాడు | RGV impressed with Prasanth Varma Message | Sakshi
Sakshi News home page

Feb 19 2018 1:52 PM | Updated on Apr 3 2019 9:16 PM

RGV impressed with Prasanth Varma Message - Sakshi

ప్రశాంత్‌ వర్మ (ఇన్‌ సెట్‌లో ఆర్జీవీ)

సాక్షి, సినిమాలు : విలక్షణ సినిమాలు, వివాదాలు.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ప్రతీ విషయాన్ని చాలా క్యాజువల్‌గా తీసుకునే వర్మ.. ఎవరైనా తన జోలికొస్తే మాత్రం ధీటుగానే స్పందిస్తుంటాడు. అలాంటి వర్మనే ఆశ్చర్యపోయేలా చేశాడు ఓ యువ దర్శకుడు. 

టాలీవుడ్‌లో అ! చిత్రంతో ప్రశాంత్‌ వర్మ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. వైవిధ్య భరితమైన కాన్సెప్ట్‌, సాహసోపేతమైన స్క్రిప్ట్‌తో చిత్రం తెరకెక్కించాడంటూ విమర్శకులు అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ యువ దర్శకుడు ఓ పోస్టుతో వార్తల్లో నిలిచాడు.‘జనాలంతా నన్ను ఆర్జీవీతో  పోలుస్తుంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్యే రెండే కామన్‌ పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇంటిపేరు.. రెండోది శ్రీదేవి ... అంటూ ట్వీట్‌ చేశాడు. అది చూసి వర్మ తన ఫేస్‌ బుక్‌ పేజీలో ‘అ!’ అంటూ రిప్లై ఇచ్చేశాడు. 

నటి శ్రీదేవి అంటే వర్మకు ఎంత ప్రత్యేకమైన అభిమానమో తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్‌ పాయింట్‌ పేరిట ఆమె పేరు ప్రస్తావన తెచ్చిన ప్రశాంత్‌.. వర్మను ఎక్కడో టచ్‌ చేశాడంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement