అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రేణుదేశాయ్ | renu desai on hillary nomination | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రేణుదేశాయ్

Jun 9 2016 12:23 PM | Updated on Apr 4 2019 3:41 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రేణుదేశాయ్ - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రేణుదేశాయ్

ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ప్రముఖులు, తమ రంగంతో పాటు సమకాలీన పరిస్థితులపై కూడా తమ వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న చాలా మంది ప్రముఖులు...

ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ప్రముఖులు తమ రంగంతో పాటు సమకాలీన పరిస్థితులపై కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న చాలా మంది ప్రముఖులు తమ అభిమానులకు చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. అదే సమయంలో రాజకీయ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

అదే బాటలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు. హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం జరుగుతున్న ప్రైమరీల్లో గెలిచి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హత సాధించిన నేపథ్యంలో రేణు తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. 'ఈ రోజు వరకు ఒక్క మహిళ అధ్యక్షురాలు కూడా లేని దేశం అమెరికాయే. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాలను ఏదో ఒక సమయంలో మహిళలు పాలించారు, పాలిస్తున్నారు. అందుకే హిల్లరీ ఎంపిక నాకు ఆశ్యర్యం కలిగించలేదు'. అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement