చిట్టి ఆన్‌ ది వే

Reason for Rajinikanth's '2.0' teaser delay - Sakshi

దీపావళికి(గతేడాది) వస్తున్నాం... జనవరి 25న వస్తున్నాం... అని ‘2.0’కి రెండు ముహూర్తాలు ఫిక్స్‌ చేశారు. రాలేదు. ఏప్రిల్‌లో మూడో ముహూర్తం ఉంది. ఈసారి రావడం పక్కా అని రజనీకాంత్‌ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వచ్చే అవకాశం ఉందని ‘2.0’ యూనిట్‌ స్పీడ్‌ చూస్తే అనిపిస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల స్పీడు పెంచారట. ‘‘2.0 సినిమా టీజర్‌ పనులు లాస్‌ ఏంజెల్స్‌లో ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి. సినిమాలో ఎక్కువ శాతం సీజీ వర్క్‌ ఉండటం మూలాన ఎక్కువ టైమ్‌ పడుతోంది. కంప్లీట్‌ అవ్వగానే టీజర్‌  విడుదల తేదీ  చెబుతాం’’ అని చిత్రదర్శకుడు శంకర్‌ పేర్కొన్నారు.

కాగా, ఈ చిత్రం ఆడియో వేడుకను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. టీజర్‌ను హైదరాబాద్‌లో, ఆ తర్వాత చెన్నైలో ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో ‘రోబో’కి సీక్వెల్‌గా  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా కనిపిస్తారు. అమీ జాక్సన్‌ కథానాయిక. ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటు న్నారు. మరి.. వస్తుందా? అదే రోజు తమిళ సంవత్సరాది. తమిళ ప్రేక్షకులు రెండు పండగలు చేసుకుంటారా? వేచి చూద్దాం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top