ఉగాదికి కొత్తగా... | Ravi Teja to unveil first look, title of his next on Ugadi | Sakshi
Sakshi News home page

ఉగాదికి కొత్తగా...

Mar 14 2018 12:17 AM | Updated on Mar 14 2018 12:17 AM

Ravi Teja to unveil first look, title of his next on Ugadi - Sakshi

రవితేజ

తెలుగు సంవత్సరాది ఉగాదికి కొత్త కొత్తగా కనిపించి అభిమానులకు పండగ ఉత్సాహాన్ని డబుల్‌ చేయనున్నారు హీరో రవితేజ. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాల ఫేమ్‌ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాళవిక శర్మ కథానాయిక. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా ఈనెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు.

రీసెంట్‌గా చిత్రబృందం యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించింది. ఆల్మోస్ట్‌ 60 శాతం సినిమా చిత్రీకరణ పూరై్తంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు నటిస్తున్న ఈ సినిమాను మే లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌. 

Advertisement
 
Advertisement
Advertisement