ఫుల్ ఎనర్జీ ... పవర్‌ఫుల్ స్టోరీ! | Ravi Teja To First Team Up With Vikram | Sakshi
Sakshi News home page

ఫుల్ ఎనర్జీ ... పవర్‌ఫుల్ స్టోరీ!

Sep 6 2016 11:04 PM | Updated on Sep 4 2017 12:26 PM

ఫుల్ ఎనర్జీ ... పవర్‌ఫుల్ స్టోరీ!

ఫుల్ ఎనర్జీ ... పవర్‌ఫుల్ స్టోరీ!

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి పవర్‌ఫుల్ ఎనర్జిటిక్ మూవీలో నటించనున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసుగుర్రం’

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి పవర్‌ఫుల్ ఎనర్జిటిక్ మూవీలో నటించనున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసుగుర్రం’ చిత్రాల రచయిత విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘లక్ష్మీ’, ‘లక్ష్యం’, ‘రేసుగుర్రం’ తదితర హిట్ చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రానికి నిర్మాత.
 
 ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ వంటి హిట్ సినిమా నిర్మించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ- ‘‘మా సంస్థలో రవితేజ చేస్తున్న తొలి చిత్రమిది. అందర్నీ అలరించేలా మంచి కథ కుదిరింది. రవితేజ ఫుల్ ఎనర్జీకి తగ్గట్టు వక్కంతం వంశీ పవర్‌ఫుల్ స్టోరీ తయారు చేశారు. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఉంటాయి. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రాజేష్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement