హీరో రవితేజ సోదరుడి దుర్మరణం | Ravi teja Brother Bharath Dies in Road Accident | Sakshi
Sakshi News home page

హీరో రవితేజ సోదరుడి దుర్మరణం

Jun 25 2017 10:37 AM | Updated on Apr 3 2019 8:07 PM

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(52) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో



టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ,  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

అంతేకాదు మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement