మంచి కంటెంట్‌ ఉన్న సినిమా | Rathera Movie Trailer Launch By Director VV Vinayak | Sakshi
Sakshi News home page

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

Jul 27 2019 12:26 AM | Updated on Jul 27 2019 12:26 AM

Rathera Movie Trailer Launch By Director VV Vinayak - Sakshi

సిద్ధేశ్వరరావు, వినాయక్, జాకట్‌ రమేశ్‌

పూల సిద్ధేశ్వరరావు హీరోగా పరిచయం కానున్న చిత్రం ‘రథేరా’. జాకట్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. నరేష్‌ యాదవ్, వైఎస్‌ కృష్ణమూర్తి, పూల సిద్ధేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా బాగుంది. కొత్త ఆర్టిస్టులతో ఈ సినిమాను రమేష్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. హీరోకి మంచి భవిష్యత్‌ ఉంది.

దర్శకుడు మంచి కంటెంట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమాతో బ్రేక్‌ రావాలి. నిర్మాతలకు డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘ఎంతోమంది నూతన దర్శకులకు వీవీ వినాయక్‌గారు స్ఫూర్తిదాయకం. ఆయన మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతో మా సినిమాకు మంచి బజ్‌ వచ్చింది’’ అన్నారు రమేష్‌. ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన వినాయక్‌గారికి థ్యాంక్స్‌. దర్శకుడు ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు’’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement