ఆ ఇద్దరికీ నేను ఫిదా | rashmika mandanna interview about devadas | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరికీ నేను ఫిదా

Sep 23 2018 2:20 AM | Updated on Jul 15 2019 9:21 PM

rashmika mandanna interview about devadas - Sakshi

రష్మికా మండన్నా

‘‘ ఏ సినిమా చేయాలన్నా క్యారెక్టర్‌ నచ్చాలి. అదే ముఖ్యం. నాగార్జున, నానీల బ్రోమాన్స్‌ (నవ్వుతూ) ఈ సినిమాకు హైలైట్‌. నేనైతే వాళ్లిద్దరి కాంబినేషన్‌ చూసి ఫిదా అయిపోయాను. వైజయంతీ మూవీస్‌ లాంటి బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చినప్పుడు నమ్మలేదు. సినిమా ప్రమోషన్స్‌ అప్పుడు పర్సనల్‌ విషయాలు డిస్కస్‌ చేస్తే న్యూస్‌ డైవర్ట్‌ అయిపోతుంది. అందుకే వ్యక్తిగత విషయాలు చెప్పను’’ అని రష్మికా మండనా అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలు. అశ్వనీదత్‌ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రష్మిక పలు విశేషాలు పంచుకున్నారు.
    
► ‘దేవదాస్‌’ సినిమాలో నానీగారు డాక్టర్‌లా కనిపిస్తారు. నేను ఆయన పేషెంట్‌ని. రోజూ ఏదో ప్రాబ్లమ్‌ అని చెప్పి క్లినిక్‌కి వెళ్తుంటాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు పూజ. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.

► ఇది మల్టీస్టారర్‌ అయినప్పటికీ నా పాత్ర బావుంటుంది. ‘గీత గోవిందం’లో నాది హీరోకు సమానంగా ఉండే పాత్ర. కానీ ఈ సినిమా కథ మొత్తం నాగార్జున, నానీగార్ల చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్‌ పాత్రలకు స్క్రీన్‌ టైమ్‌ తక్కువ ఉన్నా సర్‌ప్రైజ్‌ విషయాలు ఉంటాయి.

► నాని సార్‌తో వర్క్‌ చేయడం లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ప్రతి సీన్‌ను ఎలా ఇంప్రూవ్‌ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఏ హెల్ప్‌ కావల్లన్నా నానీగార్ని అడిగేదాన్ని.

► నాగార్జున గారితో పని చేసింది కేవలం రెండు రోజులే. కానీ రెండు రోజులూ నవ్వుతూనే ఉన్నాం. ఆయన చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు.

► ఏ సీన్‌ అయినా నా దర్శకుడు, హీరో, కెమెరామేన్‌ ఓకే అన్నాకే మానిటర్‌లో చూసుకుంటాను. వాళ్లకు నచ్చాలి అన్నది మెయిన్‌ పాయింట్‌ అని నమ్ముతాను.

► నెక్ట్స్‌ విజయ్‌ దేవరకొండతో ‘డియర్‌ కామ్రేడ్‌’ చేస్తున్నాను. అందులో క్రికెటర్‌గా నటిస్తున్నాను. పాత్రకోసం ప్రిపేర్‌ అవుతుంటే చిన్న గాయం అయింది. మళ్లీ మొదలెట్టాలి. కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాను. వేరే సినిమాలున్నాయి. వాటి గురించి ప్రొడక్షన్‌ హౌజ్‌లు అనౌన్స్‌ చేస్తాయి. తమిళంలో ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాం అంటే ఆ అంచనాలు అందుకునే స్క్రిప్ట్‌ రావాలని అనుకుంటున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement