బెంగళూరు భామ | Rashmika Mandanna is homesick | Sakshi
Sakshi News home page

బెంగళూరు భామ

Oct 25 2019 5:14 AM | Updated on Oct 25 2019 5:14 AM

Rashmika Mandanna is homesick - Sakshi

రష్మికా మందన్నా

తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌లా మారిపోయారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ మూడు భాషల్లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారామె. ఒక సినిమా లొకేషన్‌ నుంచి మరో లొకేషన్‌కు ప్రయాణం చేస్తూ ఇంటికి  వెళ్లడానికి కూడా తీరక దొరకడం లేదంటున్నారు ఈ బెంగళూరు బ్యూటీ. ‘‘నేను నటిస్తున్న ఒక్కో సినిమా షూటింగ్‌ ఒక్కో చోట జరుగుతుంది. అందుకే  నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉంటున్నాను. కన్నడ చిత్రం ‘పొగరు’ షూటింగ్‌ బెంగళూరులో జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో వేరే సినిమా.  ఆ తర్వాత రాజమండ్రి వెళ్తాను. ఆ తర్వాత పొల్లాచ్చి.

వచ్చే నెలలో యూరప్‌లో ఒక నెల షూటింగ్‌ చేయబోతున్నాను. ఇలా ప్రయాణం చేస్తూనే ఉన్నాను’’ అని తన షూటింగ్‌ షెడ్యూల్‌ వివరాలు చెప్పారు రష్మిక. అంతేకాదు గత ఆరు నెలల్లో రష్మిక తన ఇంట్లో గడిపింది 22 గంటలేనట. ఇంటిని ఎంత మిస్‌ అవుతున్నారో చెబుతూ – ‘‘తీరక లేకుండా పని చేస్తున్నాను. ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను. ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలనుంది. ప్రస్తుతం అదొక్కటే కోరుకుంటున్నాను. మొన్న ఇంటి నుంచి వచ్చేస్తుంటే మళ్లీ ఎప్పుడొస్తావు? అని మా చెల్లి అడిగింది. తను పెరిగి పెద్దదవుతోంది. తనతో ఉండటాన్ని మిస్‌ అవుతున్నాను. ఎప్పుడూ సూట్‌కేస్‌ రెడీగా పెట్టుకొని తిరుగుతున్నాను’’ అన్నారు రష్మిక.

Advertisement
 
Advertisement
Advertisement