తొలి ముఖ చిత్రం | Rashmika mandanna on cover page of gokulam magazine | Sakshi
Sakshi News home page

తొలి ముఖ చిత్రం

Jun 6 2020 5:48 AM | Updated on Jun 6 2020 5:48 AM

Rashmika mandanna on cover page of gokulam magazine - Sakshi

రష్మికా మందన్నా

చిన్నప్పుడు ఇష్టంగా వాడిన వస్తువులు, దిగిన ఫొటోలు వంటివన్నీ అపురూపంగా దాచుకుంటాం. పెద్దయ్యాక చూసుకుని మురిసిపోతాం. ఇప్పుడు రష్మికా మందన్నా ఒక ఫొటోను బయటపెట్టి, తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిగో ఇక్కడ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ఒకటి ఉంది కదా. ఈ ఫొటోనే రష్మిక షేర్‌ చేశారు. ఒక పత్రిక కవర్‌పేజీ మీద ఉన్న చిన్నారి రష్మిక చాలా ముద్దుగా ఉంది కదూ. 2001లో ప్రింట్‌ అయిన తమిళ పత్రిక ‘గోకులం’ ముఖచిత్రం కోసమే రష్మిక ఇలా రెండు చేతులకు వాచీలు పెట్టుకుని పోజిచ్చారు.

ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌ అలానే రెండు చేతులకు వాచీలు పెట్టుకుని సరదాగా ఫొటో దిగారు. ‘‘నా ఫస్ట్‌ కవర్‌ పేజీ ఇది. అప్పుడు జరిగిన ఫొటోషూట్‌ నాకింకా గుర్తుంది. మా అమ్మగారు ఆ పత్రికను భద్రంగా దాచారు. ఇప్పటికీ నా గురించి ఏ పత్రికలో వచ్చినా దాస్తుంటారు. ఇవాళ నటిగా మీ (ప్రేక్షకులు) ప్రేమను దక్కించుకోవడానికే ఇంతదాకా వచ్చానా? అనిపిస్తోంది. నా ఈ ఎదుగుదలకు కారణం నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు. అలాగే నేను వర్క్‌ చేసిన, చేస్తున్నవారు కూడా ఓ కారణం. ఒక మైల్‌స్టోన్‌ చేరుకునే క్రమంలో చేసిన యుద్ధాలు... సారీ.. ఎక్కువ చెబుతున్నాను కదూ’’ అని పేర్కొన్నారు రష్మికా.

Advertisement
 
Advertisement
Advertisement