ఢిల్లీ టు చెన్నై వయా హైదరాబాద్! | Rashi Khanna opposite Siddharth in Tamil movie | Sakshi
Sakshi News home page

ఢిల్లీ టు చెన్నై వయా హైదరాబాద్!

Sep 23 2016 12:17 AM | Updated on Sep 4 2017 2:32 PM

ఢిల్లీ టు చెన్నై వయా హైదరాబాద్!

ఢిల్లీ టు చెన్నై వయా హైదరాబాద్!

ఢిల్లీలో పుట్టి, పెరిగిన రాశీఖన్నా ఇప్పుడు తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ‘ఊహలు గుసగుసలాడే’

ఢిల్లీలో పుట్టి, పెరిగిన రాశీఖన్నా ఇప్పుడు తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ‘ఊహలు గుసగుసలాడే’ ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడి సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. చివరికి హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుని, రాశి ఇక్కడే సెటిలైపోయింది. ఎంచక్కా తెలుగు కూడా నేర్చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ భాష నేర్చుకునే పనిలో కూడా పడింది. ఎందుకంటే ఓ తమిళ చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది.
 
  సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి ‘సైతాన్ కా బచ్చా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనుష్క, తమన్నా, శ్రుతీహాసన్... ఇలా తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నవాళ్లందరూ ఆ తర్వాత తమిళంలో కూడా స్టారడమ్‌ని సొంతం చేసుకున్నారు. సో.. రాశీఖన్నాకు కూడా కోలీవుడ్ కలిసొస్తుందని ఊహించవచ్చు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement