కాఫీ తాగి.. కబుర్లు చెప్పి! | rashi khanna new movie is ayogya | Sakshi
Sakshi News home page

కాఫీ తాగి.. కబుర్లు చెప్పి!

Dec 10 2018 4:39 AM | Updated on Dec 10 2018 4:39 AM

rashi khanna new movie is ayogya - Sakshi

రాశీఖన్నా

రాత్రివేళ సముద్రతీరానికి వెళ్లిన కథానాయిక రాశీఖన్నా పొద్దుపొద్దున్నే మేడపై కాఫీ తాగి బస్టాండ్‌కి వెళ్లారు. అక్కడ స్కూల్‌కి వెళ్తోన్న చిన్నారులతో కబుర్లు చెప్పారు. ఇవన్నీ ‘అయోగ్య’ సినిమాలోని సీన్స్‌ అన్నమాట. విశాల్‌ హీరోగా వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అయోగ్య’. తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ సినిమాకు తమిళ రీమేక్‌ ఇది. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ పాండిచ్చేరిలో జరిగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పాండిచ్చేరి షెడ్యూల్‌ పూర్తవడంతో చెన్నై చేరుకున్నారు రాశీ. తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఒక కథానాయికగా నటించనున్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement