తారక్‌ సీరియస్‌ వర్కౌట్స్‌పై రణ్‌వీర్‌ క్రేజీ కామెంట్‌!

Ranveer Singh comment on NTR on Instagram - Sakshi

ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు, కొత్త లుక్‌లో కనిపించేందుకు తపించే హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ముందుంటారు. ‘టెంపర్‌’  నుంచి ప్రతి చిత్రంలో సరికొత్త స్టైలిష్‌ లుక్‌తో ఎన్టీఆర్‌ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ట్రెండీగా కనిపించిన తారక్‌.. ఆ తర్వాత ‘జనతాగ్యారేజ్‌’  యంగ్‌స్టైలిష్‌ లుక్‌తో అలరించాడు. ఆ తర్వాత వచ్చిన ‘జై లవకుశ’లో మూడు విభిన్నమైన పాత్రల్లో తనదైన వైవిధ్యాన్ని చాటి ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు తొలిసారి క్రియేటివ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు జూనియర్‌ సన్నద్ధమవుతున్నాడు. ఈ కేజ్రీ కాంబినేషన్‌పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌తో కలిసి తారక్‌ మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల నేపథ్యంలో తారక్‌ ప్రముఖ బాడీబిల్డింగ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ వద్ద శిక్షణ పొందుతున్నాడు. లాయిడ్‌ పర్యవేక్షణలో తీవ్రమైన కసరత్తులు చేస్తూ.. కండలు తిరిగిన దేహాదారుఢ్యం కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.

(ఎన్టీఆర్‌ ఫొటోపై రణ్‌వీర్‌ కామెంట్‌..)

ఈ క్రమంలో అమెరికాకు వెళ్లిన తారక్‌ అక్కడ గాయపడ్డాడంటూ సోషల్‌ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో ఫేక్‌ కథనాలు హల్‌చల్‌ చేశాయి. ఎన్టీఆర్‌ బాగున్నారని, ఆయకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, హైదరాబాద్‌కు తిరిగివచ్చారని ఆయన పీఆర్‌ మహేశ్‌ కోనేరు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కండలు తిరిగిన ఎన్టీఆర్‌ తీవ్రంగా వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోను లాయిడ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఎన్టీఆర్‌ వర్కౌట్స్‌ మరింత తీవ్రమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తికరంగా ఈ ఫొటోపై ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ కపూర్‌ కామెంట్‌ చేశారు. బీస్ట్‌ఇన్‌ అని రణ్‌వీర్‌ కామెంట్‌ చేయగా.. మీకు తెలుసు బ్రదర్‌ అంటూ లాయిడ్‌ బదులు ఇచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top