హీరో, హీరోయిన్‌ వివాహం అక్కడే..!

Ranveer Deepika to Have Destination Wedding - Sakshi

ముంబై : బాలీవుడ్‌ ప్రేమజంట దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ల పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే చాలాసార్లు వినిపించాయి. అయితే పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతునట్లు సమాచారం. పెద్దగా హడావిడి లేకుండా సమీప బంధువులు, కొద్ది మంది స్నేహితుల మధ్య వీరి వివాహం జరగనుందని ఒక జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల మాదిరిగానే దీపికా-రణ్‌వీర్‌ జంట కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. రిసెప్షన్‌ మాత్రం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి ఇరువురి కుటుంబాలు ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ని కూడా నియమించుకున్నారట. అతడితో కలిసి వివాహ వేదికను ఖరారు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 2013లో ‘గలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమాలో కలిసి నటించిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ విషయం గురించి పలు సమావేశాల్లో దీపికా, రణ్‌వీర్‌లు చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top