పెళ్లి సందేహమే | Randeep Hooda and Neetu Chandra's marriage Doubt | Sakshi
Sakshi News home page

పెళ్లి సందేహమే

May 12 2014 12:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

పెళ్లి సందేహమే - Sakshi

పెళ్లి సందేహమే

నేను పెళ్లి చేసుకుంటానన్నది సందేహమేనంటోంది నటి నీతు చంద్ర. ఈ బెంగాలీ భామ యావరుం నలమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది.

నేను పెళ్లి చేసుకుంటానన్నది సందేహమేనంటోంది నటి నీతు చంద్ర. ఈ బెంగాలీ భామ యావరుం నలమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. అనంతరం యుద్ధం ఫేమ్, ఆది భగవాన్ చిత్రాల్లో నటించింది. యోగి చిత్రంలో అమీర్‌తో ఐటమ్ సాంగ్‌కు స్టెప్స్ వేసిన ఈ బ్యూటీపై ఆ సమయంలో పలు వదంతులొచ్చాయి. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడే ప్రేమలోపడిన నీతు చంద్ర ఆయనతో రెండేళ్లు డేటింగ్ చేసింది. చాలా మంది సినీ ప్రేమికుల మాది రిగానే వీరి ప్రేమకు ముసలం పుట్టింది. ఇద్దరు చర్చించుకుని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.
 
 ప్రేమ విఫలం నీతును చాలా బాధించిందట. ఆ తర్వాత నటనపైనే పూర్తి దృష్టి సారించిన నీతు చంద్ర గురించి మళ్లీ వదంతులు మొదలయ్యాయి. రణ్‌దీప్‌తో మళ్లీ చెట్టాపట్టాలంటూ  చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి స్పందించిన నీతు చంద్ర రణ్‌దీప్ తాను మళ్లీ కలుసుకోలేదని స్పష్టం చేసింది. తాను ఒంటరేనని తెలిపింది. ఇక తన జీవితం లో పెళ్లి అనేది సందేహమేనని పేర్కొంది. తాను గ్రీస్ భాషలో నటించి న బ్లాక్ 12 అనే చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైందని వెల్లడించింది. అంతేకాదు గ్రీస్ భాషా చిత్రంలో నటించిన తొలి భారతీయ నటిని తానేనని చెప్పుకోవడం గర్వంగా ఉందని తెలిపింది. ఇకపోతే లెస్బియన్ చిత్రాలలో నటిస్తారా? అని అడుగుతున్నారని, సినిమానే అయినా మరో స్త్రీ తనను సృశించడాన్ని కలలో కూడా ఊహించలేనని నీతుచంద్ర పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement