‘బ్రహ్మాస్త్ర’ వీడియో లీక్‌..!

Ranbir Kapoor And Alia Bhatt Brahmastra Video Leaked - Sakshi

బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరు బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వీడియో లీక్‌ అయింది. 

ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. గోడ మీదనుంచి రోప్స్‌ సహాయంతో.. రణ్‌బీర్‌ కపూర్ ముందుకు వెళ్తుండం.. ఆలియా భట్‌ కూడా తన వెనక రావడం.. అయితే ఆలియా ఎక్కడ జారి పడుతుందో అంటూ జాగ్రత్తగా చేయి పట్టుకోవడం.. లాంటి దృశ్యాలతో ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఓ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవలే పూర్తిచేసినట్లు నాగ్‌ తెలిపాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top